టీటీడీ పూర్తిస్ధాయి ఈవోగా ధర్మారెడ్డి..

63
ttd
- Advertisement -

టీటీడీ పూర్తిస్ధాయి ఈవోగా నియమితులయ్యారు ధర్మారెడ్డి. ఈ నేపథ్యంలో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో జవహర్‌రెడ్డిని ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. అయితే ధర్మారెడ్డి టీటీటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు.

ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో ఈవో నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టే అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -