గ్రే మ్యాన్ సీక్వెల్‌లో ధనుష్‌!

88
- Advertisement -

ఇటీవలె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే హాలీవుడ్‌ మూవీ ‘ది గ్రే మ్యాన్’ సినిమాలో నటించిన ధనుష్ తన స్టైలిష్ ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు.

ఇండియాలో మార్కెట్ కోసం ది గ్రే మ్యాన్ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతుండగా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు ధనుష్.

ఇందుకు సంబంధించి తన సోషల్ మీడియాలో ఓ ఆడియో పోస్ట్ చేశాడు. ఈ ఆడియోలో గ్రే మ్యాన్ సీక్వెల్ రాబోతుంది. అందులో కూడా నేను నటించబోతున్నాను అని తెలిపాడు. దీంతో ధనుష్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -