కె.వి.చౌడప్ప సమర్పణలో ఫ్లైయింగ్ బర్డ్స్ క్రియేషన్స్ బ్యానర్ లో సుదర్శన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ధమ్కీ. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు నీలకంఠ, నిర్మాత రాజ్ కందుకూరిలు లాంచ్ చేశారు. ఓ ఇద్దరు కాలేజ్ అమ్మాయిలను ప్రేమించే ఇద్దరు కుర్రాళ్ళను గూండాలు కిడ్నాప్ చేసి ధమ్కీ ఎలా ఇచ్చారు. ఆ ఇద్దరు కుర్రాళ్ళు గూండాల నుండి తప్పించుకొని ఏ విధంగా తమ ప్రేమను గెలుచుకోగలిగారన్నదే ఈ షార్ట్ ఫిల్మ్.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ ‘ సుదర్శన్ రెడ్డి ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా తీసాడు. 40నిమిషాల్లో క్రైం జానర్ లో మంచి కాన్సెప్ట్ తో తీసి చూపించాడు. డైరెక్టర్ కి మంచి భవిష్యత్తు ఉంది. మంచి కమర్షియల్ సినిమా తీయగలిగే సత్తా ఈ షార్ట్ ఫిల్మ్ లో కనిపించింది .’ అన్నారు.
నీలకంఠ మాట్లాడుతూ ‘ ఇలాంటి చిన్న సినిమాతో దర్శకుడిలోని సత్తా తెలుస్తుంది. ఈ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా తీశాడు. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ వల్ల కొత్త టాలెంట్ బయటికి వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.