ధమాకా… డు డు సాంగ్ ప్రోమో రిలీజ్

132
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

ధమాకా నుండి డు డు సాంగ్ ని నవంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇటివలే ప్రకటించిన టీం తాజాగా ప్రోమోని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో మరో డ్యాన్సింగ్ నెంబర్ గా డు డు పాటని కంపోజ్ చేశారని ప్రోమో చూస్తే అర్ధమౌతోంది. ప్రోమోలో రవితేజ చేసిన స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్ పాటపై అంచనాలని పెంచింది. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, పృధ్వీ చంద్ర ఆలపించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…

ఎమ్మెల్యేల కొనుగోలు…విచారణకు మరో ఇద్దరు

భారత్ జోడో యాత్రలో ప్రియాంక…

పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్:బాస్ సాంగ్

- Advertisement -