మెగాహీరో ‘ఉప్పెన’ నుండి మరోపాట.. వీడియో

887
uppena
- Advertisement -

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ మూవీ నుండి ఇటీవలే `నీ కన్ను నీలి సముద్రం..` అనే పాట విడుదలై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుండి మరో పాట కూడా విడుదలైంది. ఈ సారి వీడియో సాంగ్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ధక్ ధక్ ధక్ అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన వస్తుంది. వినగానే సూపర్ అనిపించే క్యాచీ ట్యూన్ ఇచ్చాడు దేవీ. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎప్రిల్ 2న ఉప్పెన విడుదల కానుంది.

https://youtu.be/xzunlLhgcfs

- Advertisement -