వివాదంలో మరో హిందీ సినిమా

21
- Advertisement -

కొన్ని నెలల కిందటి సంగతి. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా వివాదాస్పదమైంది. పైగా ఈ సినిమాలో ఓ సన్నివేశంలో షారుక్ ఖాన్ -దీపిక ఓ లిప్ కిస్ సీన్ చేశారు. అందులో తప్పులేదు, కానీ హిందూ మతానికి సంబంధించిన కాషాయంలో దీపికా రెచ్చిపోయింది. పైగా షారుఖ్ ముస్లిమ్ మతానికి చెందిన షర్ట్ వేసుకుని కనిపించాడు. మొత్తమ్మీద, ఈ వ్యవహారం ఆ మధ్య హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు ధడక్ 2 కూడా వివాదంలో చిక్కుకునేలా ఉంది. ఈ సినిమాలో కూడా ఓ మతానికి వ్యతిరేఖంగా సాన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.

అసలు బాలీవుడ్ కి ఈ వివాదాల గోల ఏమిటి ?, వాళ్ళు ప్రేక్షకుల మనోభావాలను పట్టించుకోరా ?, అసలు మేకర్స్ సంగతేంటి?, సున్నితమైన అంశాల పై సినిమా తీస్తున్నప్పుడు అన్నీ కరెక్ట్ గా ఉండాలి కదా. చిన్న తప్పులు కూడా చేయకూడదు. నిజంగా ఓ మతానికి చెందిన వ్యక్తి గురించి సినిమా చేసినప్పుడు కూడా తప్పు కనిపించకూడదు. అందుకే, చాలా డీటెయిలింగ్స్ చూసుకోవాలి. పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ చేసిన తప్పు కూడా ఇదే. తన సినిమా విషయంలో షారుఖ్ జాగ్రత్త పడి ఉండి ఉంటే.. ఆ సినిమా అలా వివాదం అయ్యి ఉండేది కాదు.

ఇప్పుడు, ధడక్ 2 వివాదం ఎలా ఉంటుందో చూడాలి. హీరో సిద్ధాంత్ చతుర్వేది ఈ వివాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ?. హిందూ మతానికి చెందిన గొప్పదనాన్ని రియలిస్టిక్ గా చూపించాలనే ప్రయత్నం ఈ ధడక్ 2లో చేశామని మేకర్స్ చెబుతున్నారు. సినిమా రిలీజ్ అయితే గాని, అది ఎంతవరకు సింక్ అయ్యిందో తెలియదు.

Also Read:మహిళల్లో థైరాయిడ్.. ఎంత ప్రమాదమో!

- Advertisement -