ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలి- డిహెచ్ శ్రీనివాసరావు

113
- Advertisement -

కొత్త సార్స్ ఒమిక్రాన్ వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ డి.హెచ్. శ్రీనివాస రావు సూచించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సౌత్ ఆఫ్రికా,బొడ్స్ వానతో పాటు 14 దేశాలకు ఈ ఒమిక్రాన్ వైరస్‌ పాకింది. కేంద్రం ఆదేశాల ప్రకారం తెలంగాణలో అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసు నమోదు కాలేదు..పుకార్లు నమ్మొద్దని కోరారు. శంషాబాద్ విమానాశ్రయంలో టెస్ట్‌లు చేస్తున్నాం.. విదేశీ ప్రయాణికులపై ఫోకస్ పెట్టాం. 12 దేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను RTPCR చేసి పాజిటివ్ వాస్తే గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తామన్నారు.

నిన్న 12 దేశాల నుండి 41 మంది హైదరాబాద్ వచ్చారు…ఎవ్వరికి పాజిటివ్ రాలేదు. ఒమిక్రాన్‌కు సంభందించి ఇంకా పూర్తి సమాచారం లేకున్నా….చాల ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయ్యే గుణం ఒమిక్రాన్‌కు ఉంది. 3నర లక్షల మ్యుటేషన్ ఈ కరోనాలో ఉన్నాయి..గతంలో ఉన్న కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఒమిక్రాన్ కు గతంలో చేసిన టెస్ట్ లు చేస్తున్నాము. లక్షణాలు ఒళ్లు నొప్పులు,తల నొప్పి లాంటివి ఉంటాయని శ్రీనివాస రావు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టిందని.. సీఎం కేసీఆర్ దీని కోసం ఓ క్యాబినెట్ సబ్ కమిటీని వేసారు. మాస్క్ ని ప్రజల జీవన విధానంలో భాగస్వామ్యం చేసుకోండి అని సూచించారు. 66 వేల బెడ్స్ థర్డ్‌ వేవ్ కు సిద్దంగా ఉంచాము. కొవిడ్ కు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. థర్డ్‌ వేవ్ 5200 బెడ్స్ చిన్న పిల్లల కోసం కూడా సిద్దంగా ఉంచామని తెలిపారు.

ప్రతి రోజు 2నర లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నాం. ఫస్ట్‌ డోస్ 90శాతం పైగా ఇచ్చాము.. రెండో డోస్ 46శాతం తీసుకున్నారు. డిసెంబరు చివరి వరకు 100శాతం వ్యాక్సిన్ టార్గెట్ పెట్టుకున్నామన్నారు. ప్రజలు దయచేసి వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే తీసుకోండి అని డి.హెచ్. శ్రీనివాస రావు కోరారు.

- Advertisement -