ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వ చర్యలు: డీజీపీ

68
dgp

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు డీజీపీ మహేందర్ రెడ్డి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ,సీపీ అంజనీ కుమార్‌తో కలిసి పాల్గొన్న డీజీపీ…కరోనా సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని తెలిపారు.

ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని …సీసీ కెమెరాలు, అధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 7 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.