ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం: విజయ్ దేవరకొండ

46
vijay

అనుపమ పరమేశ్వరన్ అంటే తనకు చాలా ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు హీరో విజయ్ దేవరకొండ. నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్‌”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు.

సినిమా సాంగ్ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరుగగా ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ…అను నాకు ఇంకా ‘ప్రేమమ్’లో మేరీ లాగే కన్పిస్తావు. నువ్వు ‘ప్రేమమ్’ సినిమా చేసినప్పుడు మేము పిల్లలం. అందరం ఈ అమ్మాయి ఎవరా? అనుకున్నాము. చరణ్ అన్న కూడా అడిగాడు. ఇప్పుడు నువ్వు వుమన్ అయ్యావు” అంటూ చమత్కరించారు. కానీ అను నేచురల్ గా ఉంటుందని, ఆమె స్క్రీన్ ను మెరిపిస్తుందని అంటూ ప్రశంసలు కురిపించారు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. చిత్రబృందానికి విషెష్ తెలుపుతూ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నానిన తెలిపారు విజయ్ దేవరకొండ.