శభాష్‌ పర్వతగిరి పోలీస్: డీజీపీ మహేందర్ రెడ్డి

168
dgp mahender
- Advertisement -

పర్వతగిరి పోలీసులను అభినందించారు డీజీపీ మహేందర్ రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద వ్యవసాయబావిలో జీపు అదుపు తప్పి పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో వెంటనే స్పందించిన పర్వతగిరి సీఐ కిషన్‌తో పాటు సిబ్బందిని అభినందించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మృతిచెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. పదకొండు మంది సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవ‌ర్ మిన‌హా మిగ‌తా వారి ప్రాణాల‌ను కాపాడినందుకు ప‌ర్వ‌త‌గిరి పోలీసుల‌ను డీజీపీ అభినందించారు.

- Advertisement -