మతవిద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి

146
dgp mahender reddy
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కేసులు నమోదుచేస్తున్నామని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ…క్రిమినల్ చరిత్ర ఉన్నవారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వెల్లడించారు.

సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతల పై కేసులు నమోదు చేస్తామని …ఇప్పటి వరకు రోహింగ్యాలపై 50 -60 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని తెలిపారు.

హైదరాబాద్‌లో గత 6 సంవత్సారాల్లో ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని ….శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత అన్నారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టారని….నూతన టెక్నాలజీ ఉపయోగించి పోస్ట్ సృష్టి కర్తల పై చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -