డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు…

41
dgca
- Advertisement -

దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో పక్షులు ఇతర వన్యప్రాణులు విమానాలను ఢీకొంటున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో వాటిని నివారించేందుకుగానూ డీజీసీఏ శనివారం ఎయిర్‌పోర్ట్‌ల నిర్వాహకులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పెట్రోలింగ్‌ అసాధారణ రీతిలో వన్యప్రాణుల కదలికలు ఉంటే పైలట్‌లకు సమాచారం అందించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో విమానాలను పక్షులు ఢీకొన్న ఘటనలు విరివిగా నమోదైన విషయం తెలిసిందే. ఆగస్టు 4న అహ్మదాబాద్‌ నుంచి చండీగఢ్‌ వెళ్లే గో ఫస్ట్‌ అంతకుముందు జూన్‌ 19న పట్నా దిల్లీకి టేకాఫ్‌ అయిన స్పైస్‌జెట్‌ ఇలా పలు విమానాలు పక్షులు ఢీకొన్న ఘటనలతో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యాయి.

ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌లందరూ తమ వన్యప్రాణుల విపత్తు నిర్వహణ కార్యక్రమాలను సమీక్షించాల్సిందిగా డీజీసీఏ తన తాజా సర్క్యులర్‌లో సూచించింది. వాటిలోని లోపాలను సరిచేసి విమానాశ్రయం పరిసరాల్లో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పింది. దీంతో పాటు విమానాలకు వన్యప్రాణులతో పొంచి ఉన్న ముప్పుపై అంచనాలు రూపొందించాలని వాటి కదలికలను పర్యవేక్షించేందుకు రికార్డ్‌ చేసేందుకు తప్పనిసరిగా ఒక విధానాన్ని కలిగి ఉండాలని పేర్కొంది. విమానాశ్రయం పరిసరాల్లో భారీ ఎత్తున్న వన్యప్రాణుల కదలికలు ఉన్న సమయంలో పైలట్‌లను అప్రమత్తం చేసేందుకు వీలుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని డీజీసీఏ సూచించింది. రోజు ఒకే సమయానికి కాకుండా వేర్వేరు సమయాల్లో సాధారణ పెట్రోలింగ్‌ నిర్వహించాలని సూచించింది. ప్రతి నెల 7వ తేదీలోపు వన్యప్రాణుల విపత్తు నిర్వహణ కార్యక్రమం అమలుపై నెలవారీ నివేదికలు వన్యప్రాణుల డేటాను అందజేయాలని విమానాశ్రయ నిర్వహకులకు ఆదేశాలు జారీ ఆయ్యాయి.

- Advertisement -