TTD: తిరుమలలో గోల్డ్ మ్యాన్..

5
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించకున్నారు పూణేకు చెందిన సన్నీ వాగచోరీ, సంజయ్ గుజర్‌. మెడ నిండా బంగారు చైన్లు, చేతి నిండా బంగారు కవచాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరు ధరించిన బంగారం ఖరీదు 20 కేజీల వరకు ఉంటుందని తెలుస్తోంది.

స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన గోల్డ్ మ్యాన్లను చూసిన భక్తులు ఆశ్చర్యపోయారు. చాలామంది వారితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. విశేషం ఏంటంటే వారు ప్రయాణించే కారు కూడా గోల్డ్ కలర్‌లో ఉండటం.

శ్రావణమాసం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. పెళ్లైన కొత్త జంటలు కూడా స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పెద్ద ఎత్తున వచ్చారు. శ్రావణమాసం మూడో శుక్రవారం కావడంతో లు స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

Also Read:27 మందితో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిట్

- Advertisement -