మెగా స్టార్ చిరంజీవి అప్ కమింగ్ మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ రానుందని బాస్ పార్టీ అంటూ సాంగ్ టైటిల్ చెప్పేసి అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ ఈ సాంగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రేపు లిరికల్ వీడియో రిలీజ్ చేసే ముందు సాంగ్ ఎలా ఉండనుందో హింట్ ఇస్తూ తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.
మెగాస్టార్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో రాబోయే సాంగ్ అంటే మెగా ఫ్యాన్స్ కి చాలా అంచనాకుంటాయి. అయితే తాజాగా రిలీజైన బాస్ పార్టీ సాంగ్ ప్రోమో మాత్రం ప్రేక్షకుల తో పాటు ఫ్యాన్స్ ను కూడా నిరాశ పరిచేలా ఉంది. ప్రోమో లో దేవి …కర్చీఫ్ కట్టండి , బాస్ ఒస్తుండు రెడీ అవ్వండి అంటూ సింగ్ చేస్తూ కనిపించగా చిరు మాస్ గెటప్ లో లుంగీ పైకెత్తి పట్టుకొని సిగరెట్ కాలుస్తూ బ్యాక్ సైడ్ నుండి నడుస్తూ కనిపించాడు. చిరు విజువల్స్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ లా అనిపించనా దేవి సింగింగ్, లిరిక్స్ మాత్రం సాంగ్ పై అంచనాలు డ్రాప్ చేసేలా ఉన్నాయి.
దేవి నుండి చాలా ఎక్స్ పెక్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ ఈ ప్రోమో తో నిరాశ పడుతున్నారు. ముప్పై సెకన్ల ప్రోమో చూసి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చెయ్యలేం కానీ ప్రోమో మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మరి రేపు రిలీజ్ అయ్యాక ఈ సాంగ్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..