మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన వాల్తేరు వీరయ్య అల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకలు లోడింగ్, నీకేమో అందం ఎక్కువ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విలేఖరుల సమావేశంలో ‘వాల్తేరు వీరయ్య’ విశేషాలని పంచుకున్నారు.
ఒకవైపు జై చిరంజీవి.. మరో వైపు జై బాలయ్య అంటున్నారు ? ఏమైనా ఒత్తిడి ఉందా ?
ఎలాంటి ఒత్తిడి లేదండీ. కథ ప్రకారమే మ్యూజిక్ చేస్తాం. పైగా వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి చిత్రాలని నిర్మించింది మా నిర్మాతలే. రెండు సినిమాలు మావే. ఈ విషయంలో చాలా గర్వంగా వుంది. రెండు సినిమాలు అద్భుతంగా ఆడాలి.
వాల్తేరు వీరయ్యలో మ్యూజిక్ పరంగా కొత్తగా చేసే అవకాశం దొరికిందా ?
పూనకాలు లోడింగ్ పాట చూసే వుంటారు. బూరలాంటి వాయిద్యంతో ఆ ట్యూన్ ని కంపోజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారికి చాలా నచ్చింది. ‘’ఆదరగొట్టావ్ అబ్బాయ్’ అన్నారు. నేను కంపోజ్ చేసిన ట్యూన్ ఒక ఎత్తు అయితే మెగాస్టార్ గారు ఆయన డ్యాన్స్ లతో పాటని మరో స్థాయికి తీసుకెళ్ళిపోయారు. బాస్ పార్టీ యూత్ కి కనెక్ట్ అయ్యేలా చేశాం. బాస్ ని చాలా రోజుల తర్వాత పక్కా మాస్ ఎంటర్ టైనర్ లో చూస్తున్నాం. ఎక్కడా తగ్గకూడదని ప్రతి పాట విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం.
వాల్తేరు వీరయ్య లో ఎలాంటి ఎలిమెంట్స్ ఇవ్వబోతున్నారు ?
వాల్తేరు వీరయ్య చెప్పాలంటే ముందు దర్శకుడు బాబీ గురించి చెప్పాలి. బాబీ తో నాకు చాలా అనుబంధం వుంది. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు హిట్ కావడానికి కారణం బాబీ గారు చెప్పిన సబ్జెక్ట్, నాపై పెట్టుకున్న నమ్మకం.. అన్నిటికి మించి బాస్ మెగాస్టార్ మా ఇద్దరిపై పెట్టుకున్న పెట్టుకున్న నమ్మకం. ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలనే బాబీ డ్రీమ్ నేలవేరడం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ గారిని తీసుకురావడం బాబీ వలనే సాధ్యమైయింది. ఇందులో రవితేజ గారిది చాలా కీలకమైన పాత్ర. సినిమా చూసి చిరంజీవి గారితో ఒకే ఒక మాట చెప్పా. ‘’నవ్విస్తూ ఏడిపించారు.. ఏడిపిస్తూ నవ్వించారు’’ అని చెప్పా. ఆయన కాసేపు మౌనంగా వుండి.. ‘’ఎంత బాగా చెప్పావ్ మై బాయ్’’ అన్నారు. ఇందులో కంటతడితో నవ్వుతూ క్లాప్స్ కొట్టే సీన్స్ చాలా వుంటాయి. బాబీ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. రవితేజ, చిరంజీవి గారి సీన్స్ కి క్లాప్స్ మాములుగా వుండవు. మాస్ యుఫోరియా మాములుగా వుండదు. బాస్ ని మనం ఎలా అయితే చూస్తూ పెరిగామో.. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ వాటితో పాటు కొన్ని కొత్త ఎలిమెంట్స్ కూడా వున్నాయి. కామెడీ, డ్యాన్స్, ఫైట్స్ .. అన్నీ కుమ్మేశారు.
ఈ సినిమాలో మీకు సవాల్ గా అనిపించిన పాట ?
ప్రతి సినిమా సవాల్ గానే వుంటుంది అండీ. నేను పెద్ద ఒత్తిడి పెట్టును. చాలా సరదా చేస్తాను. నేను బాస్ ని చూస్తూ పెరిగాను. ఆయన్ని చూడగానే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఇందులో నువ్వు శ్రీదేవి పాట ఆయన స్క్రీన్ పై ఎలా చేస్తారో ముందే ఊహించేసి కంపోజ్ చేసి బాబీ కి చూపించా. అలాగే పూనకాలు లోడింగ్ పాట కూడా అంతే. రవితేజ గారు, చిరంజీవి గారు కనిపిస్తే ఎంత సందడిగా వుటుందో ఆ ఎనర్జీ అంతా పాటలో ఇచ్చేశాం. శేఖర్ మాస్టర్ గారికి కూడా థాంక్స్ చెప్పాలి. నేను బాబీ శేఖర్ ఎలాంటి ఈగోలు లేకుండా పని చేస్తాం. ఈ మధ్య కాలంలో శేఖర్ కంపోజ్ చేసిన సిగ్నేచర్ స్టెప్స్ ఎక్కువగ హిట్స్ కావడం చాలా ఆనందంగా వుంది.
ఇవి కూడా చదవండి..