డెవిల్ ఓటీటీ డేట్ ఫిక్స్!

40
- Advertisement -

డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించగా గతేడాది డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో కనిపించారు.

ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఓటీటీలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. స్వతంత్రం ముందు సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులని బ్రిటిష్ వాళ్ళు పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు, మరో వైపు ఓ హత్య కేసు ఛేదించడం అనే కథాంశంతో తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Also Read:పుష్ప 2 షూటింగ్ పై క్రేజీ అప్ డేట్!

- Advertisement -