పుష్ప 2 షూటింగ్ పై క్రేజీ అప్ డేట్!

25
- Advertisement -

అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 షూటింగ్ వేగంగా నడుస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూట్ మొత్తం మే నెల వరకూ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి మూవీ టీమ్ ప్రమోషన్లపై ఫోకస్ పెట్టనున్నారు. కాగా, ఈ మూవీ ఆగష్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఎలాగూ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అలాంటి ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతోంది. అయితే పుష్ప 2లో డాన్సులపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ఈ మధ్యే ముగిసిన ఓ షెడ్యూల్‌లో బాలీవుడ్ కొరియోగ్రఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫరీలో జాతర గెటప్స్‌తో దాదాపు 400 మంది జూనియర్లు, 100 మంది పైగా డాన్సర్లతో షూట్ చేసారనే వార్త వైరల్ గా మారింది.పుష్ప 2 లో ఇదే మెయిన్ హైలెట్ గా నిలుస్తోంది అని తాజాగా టాక్ నడుస్తోంది.

పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నిర్మాణ సంస్థ పుష్ప‌2పై మ‌రింత హైప్ పెంచింది. సుకుమార్‌కు విషెస్ చెప్తూ, ఆయ‌న విజ‌న్‌తో పుష్ప‌2 మ‌రింత గ్రాండ్‌గా తెర‌కెక్కుతుంద‌ని తెలిపారు. మొత్తానికి మ‌రింత గ్రాండ్‌గా ‘పుష్ప‌2’ రాబోతుంది.

Also Read:Sharmila:ప్రధానిగా రాహుల్..అదే వైఎస్ కల

- Advertisement -