టాలీవుడ్ టాప్ సంగీత దర్శకులలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒకరు. దేవితో పాటు అతని తమ్ముడు సాగర్ మంచి సింగర్ గా గుర్తింపు చేసుకున్నాడు. దేవి శ్రీ సంగీత సారథ్యంలో మంచి పాటలు పాడాడు. ఇటివలే సాగర్ వివాహం చేసుకున్నాడు. ఈవిషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్టర్ ద్వారా తెలియజేశారు. గత నెల 19న నా సోదరుడు సాగర్..డాక్టర్ మౌనికని వివాహం చేసుకున్నాడని చెప్పారు. ఈ విషయాన్ని తెలియజేస్తుంన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
జూన్ 19న మా అమ్మ నాన్నల వివాహం జరిగిందని మళ్లీ అదే రోజు మా తమ్ముడు వివాహం జరగడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. మా కుటుంబంలోకి మౌనికా సాగర్ కి స్వాగతం.. ఈ జంటకు మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలు కావాలి అని ట్వీట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్.
సాగర్ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రేమే హాజరైనట్లు తెలుస్తుంది. సాగర్… ఆర్య, నేను లోకల్, జనతా గ్యారేజ్, బొమ్మరిల్లు, జులాయి, డీజే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పాటలు పాడారు . డీజే చిత్రంలో సాగర్ పాడిన బాక్స్ బద్దలైపోద్ది సాంగ్ మ్యూజికల్ హిట్ అయ్యింది.