మొక్కలు నాటిన దేవీ ప్రసాద్..

215
devi prasad
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన జన్మదినం సందర్బంగా మలక్‌పేట్ లోని తన నివాసం లో మూడు(3) మొక్కలను నాటారు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ రావు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని దేవీప్రసాద్ రావు గారు తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా కుటుంబసభ్యుల తో పాటు మొక్కలు నాటానని దేవీప్రసాద్ రావు గారు తెలిపారు. మరియు పరియావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -