- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఇండియన్ ర్యాపర్, నటుడు నోయెల్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు ప్రముఖ యాంకర్, (బిగ్ బాస్ షో 4) దేవి నాగవల్లి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని అందులో పాల్గొని మొక్కలు నాటడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
అందరూ కూడా బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్లు మీనా ,ఈషా రెబ్బ ,అరియానా గ్లోరి, హీరోలు అల్లరి నరేష్ ,నవీన్ పోలిశెట్టి, టీవీ యాంకర్ ప్రత్యూష లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
- Advertisement -