ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా..!

274
- Advertisement -

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ రాజీనామా చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన తర్వాత రెండు గంటల్లోనే దేవేంద్ర ఫడణవీస్ కూడా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రలోగా ఫడణవీస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారని, అయితే, శివసేన బీజేపీని మోసం చేసిందని ఫడ్నవీస్ ఆరోపించారు. నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ఫడణవీస్.. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన విషయం విదితమే.

Fadnavis

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఫడణవీస్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర ప్రజలు మహాయుతికే పట్టం కట్టారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న శివసేన ఆ తరువాత దారుణంగా మోసం చేసింది. అధికారం కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టింది. ఓ వైపు మాతో మాట్లాడుతూ.. విపక్షాలతో చర్చలు జరిపింది. ప్రజల తీర్పుకు విరుద్ధంగా శివసేన వ్యవహరించింది. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉద్ధవ్‌ఠాక్రే బేరాలకు దిగారు.

ఎన్నికల్లో బీజేపీని అతిపెద్ద పార్టీగా మరాఠా ప్రజలు నిలిబెట్టారు. ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటా. అసెంబ్లీలో బలం లేనందును సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా’ అని ప్రకటించారు. రాజకీయ పరిణామాల తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు నా రాజీనామా లేఖ సమర్పిస్తా. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా వారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నా. కాకపోతే అలాంటి అస్థిర ప్రభుత్వం ఎంతోకాలం కొనసాగదని’ ఫడణవీస్ పేర్కొన్నారు.

- Advertisement -