- Advertisement -
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 15రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ, శివసేన పార్టీలో రెండు పార్టీలు తగ్గకపోవడంతో ఇంకా ఈ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మంత్రుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీని కలిసింది.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న లేఖను ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫడ్నవీస్ అందించారు.రాజీనామాను గవర్నర్ ఆమోదించారని ఫడణవీస్ వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు బీజేపీ కోరకపోవడంపై.. మరో ఉత్కంఠకు తెరతీసింది. మరోవైపు సీఎం పదవిని తమ పార్టీనేత అందుకోబోతున్నట్లు శివసేన నేతలు ప్రకటిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.
- Advertisement -