నిందితులకు సన్మానం సరికాదు: ఫడ్నవీస్

78
Devendra Fadnavis
- Advertisement -

గుజరాత్‭లోని గోద్రాలో 2002 నాటి అల్లర్లలో బిల్సిస్ బానో అనే ముస్లిం మహిళపై సామూహిక అత్యాచారం చేసిన 11 మందిని కోర్టు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారికి సన్మానం చేయడం దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీస్తోంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఏదేని నేరంలో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సన్మానం లాంటివి చేయడం ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వారు విడుదల అయ్యారు. అయితే అతడు పూర్తిగా నిర్దోషి అని రుజువు కానంతవరకు నిందితుడు నిందితుడిగానే ఉంటాడు. నిందితులకు సన్మానాలు చేయడం మంచిపని కాదన్నారు.

- Advertisement -