పూరి పరిరక్షణకు రూ.500 కోట్లు

10
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ ఆలయానికి తలుపులు తెరచుకున్నాయి. పూరి జగన్నాథ ఆలయానికి గల నాలుగు ద్వారాలు తెరచుకున్నాయి. ఇవాళ ఉదయం వేదమంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝితోపాటు మంత్రులంతా పాల్గొన్నారు.

ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు పూరి జగన్నాథుడిని దర్శించుకోవచ్చని సీఎం తెలిపారు. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రూ.500 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని, వచ్చే బడ్జెట్‌లో ఈ నిధులను విడుదల చేస్తామన్నారు.

12వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలో కరోనా తర్వాతి నుండి ఒక్క ద్వారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా ఆలయ నాలుగు ద్వారాలను తెరచింది బీజేపీ సర్కార్.

Also Read:శ్రీవారి సన్నిధిలో చంద్రబాబు

- Advertisement -