ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి,టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభలో మాట్లాడిన కేసీఆర్ ఈ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.
సత్తుపల్లి చైతన్యవంతమైన ప్రాంతమన్నారు. ఉద్యమసమయంలో పిడమర్తి రవి వందలాది పోలీసు కేసులు ఎదుర్కొన్నారు. జైళ్ల పాలైన వ్యక్తి. గతంలో పార్టీ అవకాశం ఇచ్చి పోటీలో నిలబెట్టాం. ఈ సమయంలో అన్ని అపోహాలు వీడి యువ నాయకుడు పిడమర్తి రవిని గెలిపించండని సూచించారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రెండు పంటలకు నీరిస్తామని అందరం కలిసి అద్భుతంగా పని చేసుకోని ముందుకుపోవాలన్నారు.
పోడు భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని… అత్యంత మానవీయ కోణంలో ఆలోచించి మంచి పథకాలు అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రగతి ఆగకుండా ముందుకెళ్లాలని టీడీపీ గెలిస్తే మనకు నష్టం జరుగుతుందన్నారు. విజ్ఞతతో ఓటేసి టీఆర్ ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కేసీఆర్ కోరారు.