పరువునష్టం కేసు..గేల్‌దే గెలుపు

204
gayle
- Advertisement -

పరువునష్టం కేసులో విండీస్ విధ్వంసక ఆల్‌రౌండర్ క్రిస్ గేల్‌దే పైచేయి అయింది. 2016 జనవరిలో తనపై తప్పుడు కథనాల్ని ప్రచురించిన ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫెయిర్‌ ఫాక్స్‌పై న్యూసౌత్ వేల్స్‌ సుప్రీం కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో తుది తీర్పువెలువరించిన న్యాయస్థానం గేల్‌కి పరిహారం రూపంలో 2,20,770 అమెరికా డాలర్లని చెల్లించాలని ఆదేశాలు జారీచేసింది.

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌- 2015 సమయంలో గేల్ తన హోటల్‌ రూములోకి వచ్చిన మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫెయిర్‌ఫాక్స్‌ మీడియా న్యూస్‌ పేపర్స్‌.. ది ఏజ్‌, ది సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ది కాన్‌బెర్రా టైమ్స్‌ కథనాలు ప్రచురించాయి. ఆమె ముందు తన మర్మాంగాలను ప్రదర్శించి అసభ్యంగా ప్రవర్తించాడని వార్తలు ప్రచురించగా గేల్ ఆ వార్తల్ని కొట్టిపారేశాడు.

తన నిజాయితీని నిరూపించుకునేందుకు కోర్టులోనే పోరాడతానని చెప్పిన గేల్..న్యూ సౌత్‌వేల్స్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. మహిళా మసాజ్ థెరపిస్ట్‌‌తో క్రిస్‌ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు నిరూపించడంలో ఆస్ట్రేలియా మీడియా సంస్థ విఫలమైంది. దీంతో నష్టపరిహారం చెల్లించుకోని పరిస్థితి నెలకొంది.

- Advertisement -