ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోండి.:దేవె గౌడ

14
- Advertisement -

తన 92వ పుట్టినరోజు సందర్భంగా మాజీ ప్రధాని,జేడీఎస్ నేత దేవె గౌడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పై నేరం రుజువైతే చర్యలు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు జేడీఎస్‌ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై మాత్రం తప్పుడు కేసులు పెట్టారన్నారు.

ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై నేను మాట్లాడదల్చుకోలేదని తెలిపారు. బాధిత మహిళలకు న్యాయం జరగాలి…. నష్ట పరిహారం అందించాలన్నారు. ఈ కేసులను ఎలా సృష్టించారో చూడాలి. ఒకే కేసులో కొందరికి బెయిల్‌ ఇచ్చారు. రేవణ్ణ విషయంలో సోమవారం తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలిపారు దేవేగౌడ. జరిగినదంతా పరిశీలిస్తే తమ కుటుంబం పరువు తీసేందుకేనని అర్థమవుతోందన్నారు.

Also Read:ఉదయం లేవగానే తలనొప్పి వస్తోందా?

- Advertisement -