టీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో మహబూబ్ నగర్ వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు …వాళ్ళకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ ప్రసంగించిన హరీష్‌రావు..తెలంగాణ ప్రజలు అమాయకులు కారు.. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడతారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
“మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ అన్యాయం చేసింది. మహబూబ్‌నగర్‌లో 6.50 లక్షల ఎకరాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీరు ఇచ్చింది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాలిమాటలు మానుకోవాలి. గాంధీభవన్‌లోనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదు. దేశంలోనే ఇంటింటికి మంచినీరు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరోధకంగా మారింది. చనిపోయిన రైతుల పేర్ల మీద కోర్టుల్లో కేసులు వేశారు..” అని హరీశ్ రావు తెలిపారు.