అండమాన్ నికోబార్ దీవుల్లో దేవర!

14
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1. ఈ యాక్షన్ డ్రామాతో తనదైన మాస్ అవతార్‌లో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటానికి తారక్ సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రం మొదటి భాగాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా సందర్భంగా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోండగా ఎన్టీఆర్ పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందు మే 19న దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అండమాన్ నికోబార్ దీవుల్లో దేవర కీలక సాంగ్‌ని రిలీజ్ చేయనున్నారట.

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని అండమాన్ నికోబర్ దీవుల్లో చిత్రీకరించనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు తర్వాత ఈ సాంగ్ షూట్ చేయనుండగా ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

Also Read:RSP:కవిత వ్యవహారంలో దుర్మార్గంగా ఈడీ

- Advertisement -