Jr NTR:పాపం దేవర పరిస్థితే బాధాకరం

23
- Advertisement -

ఎన్టీఆర్ “దేవర” సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సిన “దేవర” మరో కొత్త డేట్ ని వెతుక్కుంటోంది. దీంతో, దేవర-2 మరింత ఆలస్యం కానుంది. ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో కూడా ఓ ఊపు ఊపింది. అందుకే, దేవర కోసం డిజిటల్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, సైఫ్ అలీఖాన్ గాయపడటంతో దేవర షూటింగ్ లేటుగా పూర్తి కానుంది.

ఇదిలా ఉండగా, వీలైనంత త్వరగా దేవర పార్ట్-2ను కూడా తీయాలని కొరటాల శివ నిర్ణయించుకున్నట్టు ఈమధ్య వార్తలొచ్చాయి. దీని కోసం ఎన్టీఆర్ తో చేయాల్సిన షూటింగ్ పార్ట్ ను ఇంకాస్త వేగంగా చేస్తున్నాడనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ప్రాక్టికల్ గా చూస్తే, దేవర-2 సెట్స్ పైకి రావడం కాస్త కష్టమే. ఎందుకంటే, కీలకమైన మరో నటుడు సైఫ్ అలీఖాన్ అందుబాటులో లేడు కాబట్టి. సైఫ్ అలీఖాన్ మళ్లీ అందుబాటులోకి వచ్చేంతవరకు దేవర-1 స్టార్ట్ అవ్వకపోవచ్చు.

ఇక దేవర పార్ట్ 2 ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎందుకంటే, దేవర పార్ట్-2లో సైఫ్ అలీఖాన్ పాత్ర చాలా అవసరం అనే విషయం ఎవరికైనా అర్థమౌతుంది. అందుకే, దేవర 2 మరింత ఆలస్యం కాబోతుంది. మొత్తానికి దేవర పోస్ట్ ఫోన్ అవ్వడం చిన్న సినిమాలకు కలిసి వచ్చింది. విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్”ని ఏప్రిల్ 5న విడుదల చెయ్యనున్నారు. ఇక వారం ముందు “టిల్లు స్క్వేర్” విడుదల కానుంది. పాపం దేవర పరిస్థితే బాధాకరం.

Also Read:రాష్ట్రానికి అమిత్ షా..షెడ్యూల్ ఇదే

- Advertisement -