మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వెర్సటైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
ఇప్పటికే ఈ చిత్రం సుమారు రూ. 466 కోట్ల వసూళ్లను రాబట్టింది. పార్టు 1 హిట్ కావవడంతో పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ‘దేవర 2’ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ ఫ్యాన్స్ చూస్తున్నారు.
పార్ట్ 2 కోసం పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read:ఎన్టీఆర్‌ను కావాలనే టార్గెట్ చేశారా?

