అక్కినేని నాగార్జున ,నాచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న తాజా చిత్రం దేవదాసు. అశ్వనీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ..శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు ..కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను తారా స్థాయి కి తీసుకెళ్లింది. ఆ అంచనాల స్థాయిని ఇంకాస్త పెంచేందుకు నాగ్ పుట్టిన రోజు కానుకగా ఆగష్టు 29 న ఈ చిత్రం టీజర్ ను విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయిచుకుంది .
ఇదిలా ఉంటే ఈ అంచనాలను అందుకోవడం అనే విషయం ఒకవైపు చిత్ర నిర్మాతకి , మరో వైపు నాగార్జునకి చాలా ముఖ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి దేవదాసు సినిమా తెలుగు సినీ రంగ చరిత్రలో తిరుగులేని అధ్యాయం లా నిలిచిపోయింది. పైగా అదలా మారడానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారనే చెప్పాలి ..ఇప్పుడు అదే పేరుతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో ఆయన వారసుడు అక్కినేని నాగార్జున నటించడం అనేది ఒక సవాల్. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ సినిమా ఘోర పరాజయం చవిచూసింది.
దాని తర్వాత వస్తున్న ఈ సినిమా పై నాగ్ చాలా ఆశలను పెట్టుకున్నాడు. పైగా అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆయన ముందు నిర్మించిన మహానటి స్థాయి ని ఎంతవరకు చేరుకోగలదని సినీ ప్రేమికులు ఎంతో ఆరాటం తో ఎదురుచూస్తున్నారు. నాని కి కూడా ఈ సినిమా ఓ మోస్తారు ముఖ్యమనే చెప్పాలి.ఎందుకంటే ఈ మధ్య వచ్చిన కృష్ణార్జున యుద్ధం అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోవడమే అందుకు కారణం.ఈ సారి నాగార్జున తో కలిసి తన విజయాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ..ఏది ఎలా ఉన్న ఆగష్టు 29 న విడుదలకబోతున్న ఈ సినిమా టీజర్ గురించి ఇటు నాగార్జున ఫాన్స్ ,అటు నాని ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి .