న‌వ్వుల న‌జ‌రానా.. బుల్లితెర‌పై బ్ర‌హ్మానందం సంద‌డి

165
bramhanandam

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎక్కడ ఉన్న నవ్వులతో ముంచెత్తుతారు. ఆయన మౌనంగా ఉంటేనే అందరూ పడీ పడీ నవ్వుతారు. అలాంటింది ఓ ఎక్స్‌ప్రెషన్ ఇస్తే ఇక చెప్పేదేముంది. ఒక‌ప్పుడు బ్ర‌హ్మానందం లేని సినిమా లేదంటే అతిశ‌యోక్తి కాదు. హీరోల క‌న్నా ఈ క‌మెడీయ‌న్‌కి ఎక్కువ క్రేజ్ ఉండేది. త‌న‌దైన శైలిలో హావ‌భావాలు ప‌లికిస్తూ పొట్ట చెక్క‌లయ్యేలా న‌వ్వించిన బ్ర‌హ్మి ఈ మ‌ధ్య స‌రైన ఆఫ‌ర్స్ అందుకోవ‌డం లేదు. అందుకేనేమో ఇప్పుడు కామెడీ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేందుకు బ్ర‌హ్మీ ప్ర‌య‌త్నిస్తున్నాడు. త్వ‌ర‌లోనే బ్ర‌హ్మానందం బుల్లితెర‌పై యాంక‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నాడు.

bramhanandam

ఇప్ప‌టికే బ్ర‌హ్మానందం యాంక‌ర్‌గా చేసిన షో ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ‘స్టాండప్ కామెడీ అంటే.. కూర్చుని కూడా నవ్వొచ్చు’ అంటూ ప్రోమోలో ఆయన చేసిన సందడి అందరినీ ఆకర్షిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ షో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇన్నాళ్లు త‌న హాస్యంతో వెండితెర ప్రేక్ష‌కుల‌న అలరించిన బ్రహ్మానందం ఇప్ప‌టి నుండి బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను కూడా న‌వ్విస్తార‌న‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. వెండితెర స్టార్లు చిరంజీవి, నాగార్జున, జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రానా, నాని వంటి వారు బుల్లితెర‌పై యాంక‌ర్లుగా సంద‌డి చేసి మంచి ప్ర‌శంస‌లందుకున్నారు. ఇప్పుడు బ్ర‌హ్మానందం కూడా బుల్లితెర‌పై న‌ట యాంక‌రింగ్‌తో మంచి టాక్‌ను సొంతం చేసుకోవాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.