పేలిన దేవదాస్ శాటిలైట్ రైట్స్…

239
devadas movie
- Advertisement -

కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో క్రేజీ మల్టీ స్టారర్‌ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం దేవదాస్‌. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో, అశ్వనీ దత్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌, టీజర్‌ , ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి విపరీతమైన ఆదరణను చూరగొన్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్‌ కూడా రిలీజై ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాయి.

devadas movie

రామజోగయ్య శాస్త్రి రాసిన చెట్టు కింద డాక్డర్‌ అనే లిరికల్‌ సాంగ్‌ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాగ్‌- నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీలో హీరోలిద్దరు తక్కువ రెమ్యునరేషన్‌కే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం నాగార్జునకు, నానికి వైజయంతి మూవీస్‌తో ఉన్న అనుంబంధమే కారణం. అయితే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్ ను 15 కోట్లకు అమ్మాలని నిర్ణయించుకున్నారట. ఆ రేటుకు శాటిలైట్‌ హక్కులు అమ్ముడైతే ఈ ప్రాజెక్టు లాభాల్లో పడినట్టేనని భావిస్తున్నారు.

- Advertisement -