‘దేవదాస్‌’ నుంచి తొలగించిన సీన్‌.. చూడండి

292
- Advertisement -

కింగ్‌ నాగార్జున, న్యాచురల్‌ స్టార్‌ నాని కథానాయకులుగా నటించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన ఇందులో కథానాయికలుగా నటించారు. కాగా..ఈ సినిమాలో తొలగించిన ఓ సన్నివేశాన్ని నాని తాజాగా సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Devadas Movie

కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించారు.ఇందులో డాక్ట‌ర్ దాస్,డాక్ట‌ర్ భ‌ర‌ద్వాజ్‌ల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశం అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉంది.ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు.ఈ చిత్రంలో సీనియర్ నరేష్,రావ్ రమేష్,అవసరాల శ్రీనివాస్,బాహుబలి ప్రభాకర్,వెన్నెల కిషోర్,సత్య మొదలగువారు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు.

- Advertisement -