సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన పోసాని..

222
Posani Krishna Murali
- Advertisement -

సంచలన వ్యాఖ్యలు చేస్తు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా వుండే నటుడు పోసాని కృష్ణమురళి సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును వందేండ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకొంటారని ఆయన అన్నారు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణ రాజకీయాలను ఫాలో అవుతున్నానని చెప్పారు. సీఎం కేసీఆర్ మళ్లీ సీఎంగా ఉంటారు, తెలంగాణలో గెలుస్తారు, తప్పకుండా గెలువాల్సిందే అని పోసాని పేర్కొన్నారు.

Posani Krishna Murali

సీఎం కేసీఆర్ ఆంధ్రా వాళ్లకు కొత్తేమీ కాదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చారిత్రాత్మకం. ప్రతిఒక్కరు మెచ్చుకోవాల్సిందే అని కొనియాడారు.దేశంలో ఏ సీఎం చేయలేనివిధంగా పాలన చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌తో తనకెలాంటి బంధుత్వం లేదని, అయినా సంక్షేమ పథకాలను చూసి సీఎం కేసీఆర్‌కు ఓటేస్తానని చెప్పారు.

తెలంగాణకు సీఎం కేసీఆర్‌తో చాలా ప్రయోజనం జరిగిందని, ఒక టర్మ్‌లో రాష్ర్టానికి ఇంత సేవచేసిన సీఎంలు దేశంలో ఎవరూ లేరని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, నిరంతర విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టులు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పెద్ద ప్రాజెక్టును దేశంలో ఎవరూ నిర్మించలేదని, కానీ సీఎం కేసీఆర్ నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టుతో సగం తెలంగాణ బాగుపడుతుందని పోసాని అభిప్రాయపడ్డారు.

- Advertisement -