ఘనంగా ‘దేవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

342
- Advertisement -

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవ్’. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యింది. ఈ మూవీని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

Dev Movie Pre Release

దర్శకుడు రజత్ రవిశంకర్ మాట్లాడుతూ.. దేవ్ సినిమాలో హీరో క్యారక్టర్ అందరికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది.. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత లక్ష్మణ్‌కి, తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.. సినిమాలో అన్ని అంశాలు ఉన్నాయి..అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన నా టీంకి కృతజ్ఞతలు..హారిస్ జయరాజ్ మ్యూజిక్ చాల బాగా ఇచ్చారు.. అందరి కృషి తోనే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది.. సినిమాకి పనిచేసిన అందరి టెక్నిషియన్స్‌కి చాల థాంక్స్ అన్నారు.

Dev Movie Pre Release

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. కార్తీతో చాల రోజుల నుంచి అనుబంధం ఉంది.. కార్తి లాంటి హీరోతో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికి ధన్యవాదాలు. సినిమా ఇంత బాగా రావడానికి చాల మంది పనిచేశారు.. హీరోయిన్ రకుల్ చక్కని అభినయం కనపరిచింది.. దర్శకుడు రజత్ స్క్రిప్ట్‌లో ఎం చెప్పాడో స్క్రీన్‌లో అదే చూపించాడు. మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అయన. మ్యూజిక్ చాల బాగుంది. హారిస్ జయరాజ్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి చాల చాల థాంక్స్ అన్నారు.

- Advertisement -