జబర్దస్త్ నరేష్‌పై దాడి..

389
Attack on Jabardasth naresh
- Advertisement -

బుల్లితెర పాపులర్ షో జబర్దస్త్ నటుడు నరేష్‌పై దాడి జరిగింది. శ్రీకాకుళం జిల్లా చిన్నబరాటం వీధికి చెందిన కొంతమంది యువకులు నరేష్‌తో పాటు ఆయన టీంపై దాడికి పాల్పడ్డారు. కళింగానాంధ్రా ఉత్సవాల్లో కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రీన్‌ రూమ్‌లో జరిగిన గొడవే నరేష్‌ టీంపై దాడికి కారణంగా తెలుస్తోంది.

ఈ దాడిలో నరేష్ తోపాటు కొందరికి స్వల్ప గాయాలైనట్టు సమాచారం. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కళింగాంధ్ర ఉత్సవాల్లో ఇలాంటి ఘటన జరగడంపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ టీమ్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

వయసు 20కి దగర్లో ఉన్నా జన్యు లోపంతో ఐదేళ్ల బాలుడిగా అలరిస్తాడు నరేష్. తన లోపానికి కుంగిపోకుండా జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని దూసుకుపోతున్నాడు. డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్సుల్లోనూ ఇరగదీస్తాడు. జబర్దస్త్ తో పాటు నా షో నా ఇష్టం వంటి కార్యక్రమాల్లో అలరించాడు నరేష్‌.

- Advertisement -