గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించిన దేతడి హారిక..

1053
Dethadi Harika
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్‌ బాస్‌ ఫేం దేతడి హారిక నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. గతంలో కూడా నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

పచ్చదనం పెంచడం కోసం వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌కు వారి గ్రూపు సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని అందులో భాగంగా నా మిత్రుడు నటుడు నోయెల్ సేన్, బిగ్ బాస్ 2 ఫేం దీప్తి సునైనా లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -