లక్ష్యం లేని ప్రయాణం ఎక్కడికి వెళ్లుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఔరంగాబాద్ జబిందా మైదానంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సభ సందర్భంగా మహానీయులు స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ బసవేశ్వరుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పాటు పలువురు మరాఠా యోధులకు నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు నేతలు కార్యకర్తలు చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే అభయ్ పాటిల్‌తో పాటు ఆయన అనుచరులు పార్టీలో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అశేష జనసంద్రంను ఉద్దేశించి మాట్లాడారు.
ముస్లిం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం అనంతరం మాట్లాడుతూ.. మరాఠా భూమి ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని అన్నారు. బీఆర్ ఎస్‌కు ఒక లక్ష్యం ఉంది నామాటలు ఇక్కడి విని ఇక్కడి మర్చిపోకూడదు. నామాటలపై గ్రామాలకు వెళ్లి చర్చ చేయండి. దేశంలో రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో చెప్పాలిని ప్రశ్నించారు. ఈ దేశంలో జీవనదులు ఉన్న వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడంలో ఈ ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని ప్రశ్నించారు. గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రకు నీటి సమస్య ఎందుకు. దేశంలో ఇన్ని జీవనదులు ఉన్నా తాగేందుకు నీళ్లుండవా? పెద్దపెద్ద మాటలు మాట్లాడే పాలకులు కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేరా? ఇలాంటి ప్రభుత్వాలను కొనసాగించాలా? ఇంటికి పంపాలా?
Also Read: 2024.. సార్వత్రిక సమరానికి సై…!
ముంబయి దేశ ఆర్థిక రాజధాని. కానీ తాగేందుకు నీళ్లుండవా? తాగనడానికి నీళ్లు దొరకని పాపానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. దేశం పురోగమిస్తుందా? తిరోగమిస్తుందా అని ఒకసారి ఆలోచించండి అని పిలుపునిచ్చారు. ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ఇదంతా మన కళ్లముందే జరుగుతుంది. ఇది ఇలాగే జరగాలా? చికిత్స చేయాలా? ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడుతామని అన్నారు. భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారు. ధైర్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదన్నారు.
Also Read: సామాన్యులపై జీఎస్టీ..అదానీ పోర్టులపై నో జీఎస్టీ!
అనివార్యమైన మార్పును తీసుకురావడం కోసమే బీఆర్‌ఎస్ పుట్టింది. మార్పు వచ్చే వరకు బీఆర్‌ఎస్ పోరాటం ఆగదు. మనల్ని బాగు చేసేందుకు ఎవరో విదేశాల నుంచి రారు. దేశ భవిష్యత్ మీమేదే ఆధారపడి ఉందన్నారు. నిజాయితీగా మేం చేసే పోరాటానికి విజయం తథ్యం. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ నీరు ఇస్తాం. మహారాష్ట్రలో ఐదేళ్లలో ప్రతి ఇంటికీ నీరిస్తాం. ఎన్ని ఆటంకాలు సృష్టించినా పోరాటం ఆగదన్నారు.