దేశ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

21
- Advertisement -

తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్‌. శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు, అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో ఆత్మశుద్ధిని పరివర్తనను కలిగిస్తాయని సీఎం అన్నారు. మహాశివుని కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో ప్రజలందరూ శివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. అర్ధనారీశ్వరుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి…

లోకేశ్ యువగళం.. జోష్ నిల్ ?

ఈ ఆకు గురించి తెలిస్తే.. తినకుండా ఉండలేరు!

సీఎం ఫాంహౌస్‌లో గ్రీన్ ఛాలెంజ్..

- Advertisement -