‘దేశ్ కీ నేత ‘ కే‌సి‌ఆర్.. నో డౌట్ !

167
- Advertisement -

కేవలం తెలంగాణ వరకే పరిమితం అయిన టి‌ఆర్‌ఎస్ పార్టీ రూపాంతరం చెంది దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలో బీజేపీ అక్రమ పాలనకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక బి‌ఆర్‌ఎస్ నినాదం దేశంలోని ప్రతి గ్రామానికి చేరే విధంగా కే‌సి‌ఆర్ ముందుకు ముందుకు సాగుతున్నారు. దేశానికి వెన్నెముక గా నిలిచే రైతులకు అధిక ప్రదాన్యం ఇస్తూ ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని ఆదర్శంగా నిలపాలనే ఆకాంక్ష తో కే‌సి‌ఆర్ ఉన్నారు. అందుకే బి‌ఆర్‌ఎస్ ” అప్ కీ బార్ కిసాన్ సర్కార్ ” నినాదంతో ముందుకు కదులుతోంది. ఇక ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ నినాదానికి దేశంలోన్ని అన్నీ వైపులా నుంచీ సానుకూల స్పందన వస్తోంది. .

ఇప్పటి బీజేపీ సర్కార్ రైతుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అందరికీ తెలిసిందే. అందుకే దేశంలోని రైతు సంఘాలన్నీ కూడా మోడీ సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రైతన్నకు అధిక ప్రదాన్యం ఇచ్చిన కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో దేశంలోని రైతులంతా కే‌సి‌ఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ కి చరమగీతం పాడేందుకు కే‌సి‌ఆర్ తో కలిసి నడుం బిగిస్తున్నారు. ఇక బి‌ఆర్‌ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరిచే పనిలో కే‌సి‌ఆర్ వేగంగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే డిల్లీలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన కే‌సి‌ఆర్.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా బి‌ఆర్‌ఎస్ కార్యాలయాలను స్థాపించేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నారు.

కే‌సి‌ఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ అభివృద్ది దేశ వ్యాప్తంగా విస్తరిస్తుందని ప్రజలు ఆసక్తితో ఉన్నారు. అందుకే దేశ అభివృద్ది విషయంలో ఎక్కడ రాజీపడేది లేదని కే‌సి‌ఆర్ దృఢ నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపికి ప్రత్యామ్నాయంగా బి‌ఆర్‌ఎస్.. మోడీకి ధీటైన ప్రత్యర్థిగా కే‌సి‌ఆర్ మాత్రమే అనే భావనా కలుగక మానదు. దాంతో వచ్చే ఎన్నికల్లో మోడీ నిరంకుశ పాలనకు స్వస్తి పలికేందుకు దేశ్ కీ నేతగా కే‌సి‌ఆర్ ను చూస్తున్నారు దేశ ప్రజలు. మరి బి‌ఆర్‌ఎస్ మొదట్లోనే బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు షాక్ ఇచ్చేలా ప్రజా మద్దతు పొందుతుండడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ సర్కార్ కు కే‌సి‌ఆర్ చెక్ పెట్టె అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

భారత్‌లోనే ముస్లింలకు రక్షణ…అజ్మీర్ చిస్తీ

టీటీడీ మండలి సభ్యుడిగా దాసరి కిరణ్

అమితాబ్ కామెంట్స్ పై రచ్చ

- Advertisement -