దేశరాజధాని ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ..

89
delhi
- Advertisement -

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6 శాతం దాటిపోవ‌డంతో ఢిల్లీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఢిల్లీలో నైట్ క‌ర్ఫ్యూతో పాటు వీకెండ్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ అవ‌కాశం క‌ల్పిస్తూ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. ఢిల్లీతో పాటు అటు ముంబై, కోల్‌క‌తా, మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో కూడా క్ర‌మంగా కేసులు పెరుగుతున్నాయి.

ఇప్పటికే ఢిల్లీలో ఎల్లో అల‌ర్ట్‌ను అమ‌లు చేస్తున్నారు. నైట్ క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తూ, స్కూళ్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, పార్కులను మూసేసిన సంగ‌తి తెలిసిందే. 50 శాతం సీటింగ్‌తో రెస్టారెంట్, బార్లు న‌డుస్తున్నాయి. మెట్రోను కూడా 50 శాతం సీటింగ్‌తోనే న‌డుపుతున్నారు.

- Advertisement -