- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత రాత్రి 7.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత 14 సంవత్సరాలలో నవంబర్ నెలలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలుగా తెలిపింది వాతావరణ శాఖ. హిమాలయ పర్వతాల పరిధిలో మంచు కురవడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
2006 నవంబర్ 29 తర్వాత ఢిల్లీలో ఉష్ణోగ్రతలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారని వాతావరణశాఖ ప్రాంతీయ సూచన కేంద్రం హెడ్ కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సీజన్‌లో తొలిసారిగా ఢిల్లీలో కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
వాతావరణశాఖ దగ్గరున్న డేటా ప్రకారం, నవంబర్‌లో ఇప్పటివరకు కనిష్ట ఉష్ణోగ్రత 3.9 డిగ్రీ సెంటీగ్రేడులుగా 1938, నవంబరు 28న నమోదైంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం నుంచి మంచు గాలులు వీస్తున్న కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపారు.
- Advertisement -