రైతుల ర్యాలీ..22 ఎఫ్‌ఐఆర్లు నమోదు

139
delhi police
- Advertisement -

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారగా వందల సంఖ్యలో రైతులు, పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు ర్యాలీలో 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశామని ఇప్పటివరకు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో 300 మంది సైనికులు గాయపడ్డారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లలో పేర్లు నమోదుచేసిన వారిలో ఆరుగురు రైతు సంఘాల నేతలు రాకేశ్ తికాయట్, దర్శన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటాసింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉన్నారు.

హత్యాయత్నం, దోపిడీ వంటి విభాగాల్లోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం కేసు దర్యాప్తును క్రైం బ్రాంచ్‌కు అప్పగించారు. దుండగులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేయడంలో క్రైం బ్రాంచ్‌ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.

- Advertisement -