దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ చారిత్రక ఘట్టం.

225
trs office
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో నేడు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది.వసంత్ విహార్ లో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆధ్వర్యంలో భూమి పూజ జరగనుంది.

మధ్యాహ్నం 1.48 నిమిషాలకు భూమి పూజ ముహూర్తం.ఉదయం 10 గంటల నుంచి వేదపండితుల పూజలు చేయనున్నారు.మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత వసంత్ విహార్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.ప్రతిష్టాత్మక కార్యక్రమాన్నీ వీక్షించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు గులాబీ కార్యకర్తలు, నాయకులు.ఢిల్లీ వసంత్ విహార్ లో టీఆర్ఎస్ పార్టీకి 1100 చదరపు మీటర్ల భూమి కేటాయించగా ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

- Advertisement -