ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ హవా

45
kejriwal

సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ ఆప్ సర్కార్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటింది. 5 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు ఆప్‌ గెలుచుకోగా ఒక స్ధానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. కనీసం ఒక్క సీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది.

ఆమ్ ఆద్మీ పార్టీ.. క‌ళ్యాణ్‌పురి, రోహిని, త్రిలోక్‌పురి, షాలిమార్ భాగ్ వార్డుల్లో విజ‌యం సాధించగా చౌహాన్ భంగ‌ర్ వార్డును కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. విజ‌యం ప‌ట్ల ఆప్ కార్య‌క‌ర్త‌ల‌కు కంగ్రాట్స్ తెలిపారు డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా. 2022 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు బీజేపీకి ఇదో సందేశ‌మ‌ని ..బీజేపీ పాల‌న ప‌ట్ల ఢిల్లీ ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని ఆరోపించారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేజ్రీవాల్ పార్టీనే గెలిపిస్తార‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.