- Advertisement -
ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుండగా.. మరోసారి ఈ నెల 24వ తేదీ వరకు ఉదయం 5 గంటల వరకు పొడగించారు. ఢిల్లీలో మొదట ఏప్రిల్ 19న లాక్‌డౌన్ అమలులోకి కాగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య నాలుగుసార్లు పొడగించారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11శాతానికి పడిపోయిందని శనివారం సీఎం ప్రకటించారు. ఏప్రిల్ మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతం ఉండగా.. ప్రస్తుతం భారీగా తగ్గింది. ఇదిలా ఉండగా.. నిన్న ఢిల్లీలో 6,500 కొవిడ్ కేసులు రికార్డయ్యాయి.
- Advertisement -