ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఒట్టి బోగస్!

47
- Advertisement -

గత రెండేళ్ళుగా దేశ రాజకీయాల్లో ఢిల్లీ లిక్కర్ స్కాం ఎంతటి సంచలనం రేపుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా  ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఈ కేసు కొనసాగుతూ వస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్టు అయిన సంగతి తెలిసిందే. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, డిప్యూటీ సి‌ఎం మనిష్ సిసోడియ, ఎమ్మెల్సీ కవిత.. ఇలా చాలమందినే ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అయితే ప్రతిపక్ష నేతలే ఎందుకు  టార్గెట్ అవుతున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఈడీ చేస్తున్న దాడుల వెనుక మోడి సర్కార్ ఉందనేది బహిరంగ రహస్యం. .

ఈ నేపథ్యంలో డిల్లీ లిక్కర్ స్కామ్ ఒట్టి బోగస్ అనే దానిపై బి‌ఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2022 నవంబర్ 11 అరబిందో ఫార్మా ప్రమోటర్, డైరెక్టర్ శరత్ చంద్రను డిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసింది ఈడీ. అయితే అరెస్ట్ అయిన నాలుగు రోజులకు అరబిందో ఫార్మా కంపెనీ బీజేపీకి రూ. 5 కోట్లు విరళంగా ఇచ్చింది. ఆ తర్వాత శరత్ చంద్ర బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించకపోవడం, జైలు నుంచి బయటకు వచ్చిన శరత్ చంద్ర అప్రూవర్ గా మారతానని ప్రకటించడం వంటివి చక చక జరిగిపోయాయి.

అంతే కాకుండా ఈ అరబిందో ఫార్మా కంపెనీ నుంచి బీజేపీకి నవంబర్ 8, 2023 న రూ.25 కోట్లు ముడుపులు అందినట్లు తెలుస్తోంది. ఇలా అక్రమ స్కామ్ లతో బెదిరిస్తూ రాజకీయంగా లభ్ది పొందేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు బి‌ఆర్‌ఎస్ పార్టీ ట్విట్టర్ లో ఆధారాల సహ పోస్ట్ చేసింది. ఇప్పటివరకు ఈ స్కామ్ ఆమ్ ఆద్మీ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అకాలీదళ్, బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇలా అన్నీ ప్రతిపక్ష పార్టీలే టార్గెట్ కావడం వెనుక ఈ కేసు ఒట్టి బోగస్ అని బి‌ఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో గతంలో నిందితుడిగా ఉన్న మాగుంట రాఘవరెడ్డికి బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించింది. దీన్ని బట్టే డిల్లీ లిక్కర్ స్కామ్ బోగస్ అనే విషయం స్పష్టంగా అర్థమౌతోందనేది కొందరి అభిప్రాయం.

Also Read:ఆప్ నిరసనలు..ఢిల్లీలో హై అలర్ట్

- Advertisement -