దేశ రాజధాని ఢిల్లీలో మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో పాజిటివ్ రేటు 2 శాతానికి పడిపోగా క్రమంగా లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యం ఆర్డర్ ఇచ్చినవారికి హోం డెలివరీ చేసేందుకు అనుమతిచ్చింది ఆప్ సర్కార్. ఎల్-13 లైసెన్సు లేని వారు మద్యం హోం డెలివరీ చేయరాదని తేల్చి చెప్పింది సర్కార్.
భారతీయ కంపెనీలకు చెందిన మద్యం కానీ.. విదేశాలకు చెందిన మద్యాన్ని అయినా ఇంటికి డెలివరీ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఢిల్లీ అబ్కారీ ప్రకటన ప్రకారం.. ఎల్-13 లైసెన్సు ఉన్న షాపులు మద్యాన్ని హోం డెలివరీ చేయవచ్చు. కానీ కచ్చితంగా ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. అయితే హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు మాత్రం మద్యం హోండెలివరీ ఉండదన్నారు.